Tuesday, January 21, 2025

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

- Advertisement -
- Advertisement -

రైతులను కరెంట్ రూపంలో మృత్యువు కబళించింది. కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తిక్కల భూమయ్య అనే రైతు వ్యవసాయ పొలం దగ్గర బోరు మోటారు రిపేర్ చేసి, పైపులు దించుతున్న క్రమంలో పైపు కరెంటు వైర్లకు తాకి నలుగురు వ్యక్తులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారిని హుటా హుటిన వేములవాడ ఆసుపత్రికి తరలించగా పంబాల భూమయ్య (35) మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య అనిత, కూతురు గౌతమి, కుమారుడు రేస్వంత్ ఉన్నారు.

ఈ సంఘటనలో పంబలా రాజు, కర్ణాల మహేష్, తుపాకుల శ్రీనివాస్ తీవ్రంగా గాయపడడంతో వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తేలుసుకుంటామని ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు. విషయం తెలుసుకున్న వేములవాడ ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హుటాహుటిన వేములవాడ ఏరియా ఆస్పత్రికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. అదేవిధంగా క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News