Wednesday, January 22, 2025

ఏనుగు దాడిలో మరో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతుపై ఏనుగు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. గురువారం ఉదయ కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోషన్న తన పొలంలో మోటర్ పెట్టడానికి వెళ్లే క్రమంలో అతని పొలంలోనే ఏనుగు కనిపించింది. ఒక్కసారిగా అతనిపై ఏనుగు దాడి చేయడంతో పోషన్న అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, గ్రామస్తులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం చింతనమానపల్లి మండలంలో శంకర్ అనే రైతుపై ఏనుగు దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News