Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల పరిధిలోని కంసానిపల్లి గ్రామానికి చెందిన బోల్లు రాములు(32) అనే రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఉప్పునుంతల ఎస్సై శేఖర్‌గౌడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మృతుడు వ్యవసాయ పోలంకు వేళ్ళి ఇంటికి వస్తుండగా ఎదురుగా అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ (టిఎస్31హెచ్ 2454) ఢీకోట్టింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చేట్టుకు తల తగిలి రాములు మృతి చెందినట్లు తెలిపారు.

శనివారం ఉదయం చేట్లపోదల్లో ఉన్న మృతదేహన్ని గ్రామస్తులు చూసి కుటుంబసభ్యులకు తెలపడంతో మృతిని భార్య చంద్రకళ ఇచ్చిన పిర్యాదు మేరకు సంఘటన స్థలంకు పోలీసులు పంచనామ చేసి, మృతున్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ దవఖాన తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అందించి, ట్రాక్టరు డైవర్‌పై కేసు నమాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News