Friday, December 20, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతు మృతి

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిద్రస్తున్న రైతుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ ఐకేపీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొనుగోలు కేంద్రంలో రైతు టార్పాలిన్ కప్పుకుని నిద్రస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రైతుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో బాధిత రైతు మొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News