Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

చిట్యాలః విద్యుదాఘాతంతో  రైతు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని తిరుమలాపురం గ్రామ శివారు రామచంద్రపురంలో గాజే రమేష్(40) రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వైరు వేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రైతు మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News