Thursday, December 26, 2024

కరెంటు వైర్లు యమ పాశాలై..

- Advertisement -
- Advertisement -

సిర్పూర్ యుః వ్యవసాయ పనుల కోసం వెళ్లి కింద పడ్డా వైర్లను తాకి రైతు దుర్మరణం చెందిన ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా లోని సిర్పూర్ యు మండలం రాఘాపూర్ గ్రామానికి చెందిన కోవ బాజిరావు (48) బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై పంట పోలంలోనే మృత్యువాత పడ్డారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ గాలీ వానకు పై నున్న విద్యుత్ వైర్లు చెను కంచేపై పడగా ఉదయం పూట అది గమనించని బాజిరావు వాటిని తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సిర్పూర్ యు జడ్పిటిసి కోవ అరుణ విద్యుత్ శాఖ ఆధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కొరారు. ఘటన స్థలాన్ని సర్పంచ్‌తో పాటు తదితరులు పరామర్శించారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News