Saturday, December 21, 2024

ట్రాక్టర్, నాగలి మధ్య ఇరుక్కొని రైతు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా వాహనం బురదలో ఇరుక్కొని ఇంజిన్ పైకి లేసింది. దీంతో ట్రాక్టర్, నాగలి మధ్య ఇరుక్కొని రైతు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంద్రపాలనగరానికి చెందిన పెద్దగోని నర్సింహ(54) భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి వ్యవసాయం పనులు చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడిపిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాసింగి సీజన్ ప్రారంభం కావడంతో పొలం దున్నడానికి వెళ్లాడు. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో ఇరుక్కుపోయింది. ఇంజిన్ పూర్తిగా పైకి లేవడంతో వెనక్కి పడిపోయింది. దీంతో నర్సింహ ఇంజిన్, నాగలి మధ్య ఇరుక్కొని దుర్మరణం చెందాడు. భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మల్లయ్య తలెఇపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News