Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

లింగాల : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో శనివారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాయిపల్లి గ్రామానికి చెందిన పుట్ట నిరంజన్(38) తన వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నాడు.

కాగా పంటకు నీళ్లు పెట్టేందుకు బోరు మోటారు స్టార్టర్‌ను ఆన్ చేయబోయి ప్రమాదవశాత్తు స్టార్టర్‌లోని విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఎల్లమ్మ, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. మృతుని అన్న మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News