Friday, December 20, 2024

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అనంతసాగర్‌లో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మెంగళి లక్ష్మయ్య(54) వ్యవసాయం చేస్తాడు. కాగా లక్షయ్యకు కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. అందరి వివాహాలు జరిపించాడు. రోజు మాదిరిగా లక్ష్మయ్య ఉదయం పాలం వద్దకు వెళ్లి వరి పంటకు నీళ్లు పెట్టేందుకు మోటార్ పెట్టాడు.

స్టాటర్ నడవక పోవడంతో దాని మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి రాలేదని కుమారుడు పాలం వద్దకు వెళ్లి చూడగా చేతిలో విద్యుత్ వైర్తో పొలంలో పడి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐఐ బాలకృష్ణ సఃగటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టమ్ నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటు ఎస్‌ఐ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News