Saturday, November 16, 2024

అన్నం పెట్టిన రైతుతో కొంగ దోస్తీ(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: విశ్వాసానికి మారుపేరుగా శునకాల గురించి మనం చెప్పుకుంటాం. అయితే.తన ఆకలి తీర్చిన వ్యక్తికి కృతజ్ఞత తెలియచేసే గుణం పక్షులకూ ఉంటుందని ఉత్తర్ ప్రదేశ్‌లో రుజువైంది. గతంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తికి, ఒక కొంగకు ఏర్పడిన బంధం గురించి సోషల్ మీడియాలో సంచలనం కాగా తాజాగా ఆ రాష్ట్రంలోనే మరో బంధం వెలుగు చూసింది. మావ్ జిల్లాకు చెందిన రామసముజ్ యాదవ్ అనే వ్యక్తికి కొంగతో ఏర్పడిన స్నేహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆకలితో ఉన్న ఒక కొంగకు యాదవ్ తన పంట పొలాల్లో ఒకసారి గింజలు వేశాడు. అది మళ్లీ ఆహారం కోసం మరుసటి రోజు కూడా యాదవ్ పొలానికి వచ్చింది. అలా..అది ప్రతిరోజు ఆహారం కోసం యాదవ్ పొలానికి రావడం మొదలుపెట్టింది.

Also Read: నా బెడ్ రూమ్‌లో ఆయన పోస్టర్స్ ఉంటాయి: ప్రముఖ నటి ఖుష్బూ

యాదవ్ వెంటనే నడుస్తూ పొలంలో అది కొద్ది సేపు గడుపుతుంది. వారిద్దరి మధ్య స్నేహం ఎంత బలపడిందంటే ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదట. ఇందుకు సంబంధించిన వీడియోను యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. గతంలో అమేథీకి చెందిన ఆరిఫ్ ఖాన్ గుర్జర్ అనే వ్యక్తికి ఒక కొంగతో ఏర్పడిన స్నేహం తీవ్ర వివాదాస్పదమైంది. దెబ్బతిన్న ఒక కొంగను ఆరిఫ్ ఖాన్ రక్షించి దానికి వైద్య చికిత్స అందచేశాడు. దీంతో ఆ కొంగ అతని ఇంట్లోనే ఉండిపోయింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు మార్చి నెలలో వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద ఆరిఫ్ ఖాన్‌పై కేసు పెట్టి ఆ పక్షిని తమ వెంట తీసుకెళ్లిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News