Thursday, January 23, 2025

మాది రైతు ప్రభుత్వం.. కేంద్రానిది కార్పొరేట్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్‌సి కవిత ఫైర్

Farmer government is Telangana

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మాది (టిఆర్‌ఎస్) రైతు ప్రభుత్వమని….కేంద్రంలోని మోడీ సర్కార్‌ది కార్పొరేట్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వారికి అనూకూలంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్న పెట్టే రైతుల ప్రయోజనం కోసం మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు మనస్సు రావడం లేదని కవిత ఆరోపించారు. కేవలం అంబానీ, ఆదానీల కోసం బిజెపి పాలన సాగిస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ….ఎటువంటి స్పందన లేకపోవడం విచారకమన్నారు. అలాంటి రైతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా నిలిచారన్నారు. మొత్తం ధ్యానాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న విషయాన్ని కెసిఆర్ స్పష్టం చేశాన్నారు. రైతుల పట్ల సిఎం కెసిఆర్‌లా నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్రం…పక్కా కమర్షియల్‌గా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

దేశానికి అందించే బియ్యంలో తెలంగాణ నుంచే 40 శాతం ఉన్నాయన్నారు. ఈ క్రమంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీలో సిఎం కెసిఆర్ మొదలుకుని మంత్రులతో కలిసి ధర్నా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర రైతులను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మన వరి రైతులను కేంద్రం క్రూరంగా వదిలిపెట్టిన విధానం, రైతులు ప్రభుత్వ మద్దతు అవసరమయ్యే ఇతర వర్గాల పట్ల వారి దృక్పథాన్ని తెలియజేస్తుందని కవిత స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేసేందుకు నిరాకరించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిఎం కెసిఆర్ రంగంలోకి దిగారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు.

3.5 లక్షల వరిసాగు చేసే రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణాను పోల్చడానికి బిజెపి,కాంగ్రెస్‌లు ప్రయత్నించాయని కవిత ఆరోపించారు. 3.5 లక్షల వరి సాగు చేసే చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఎక్కడ? 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. ఇది యాపిల్ నారింజను పోల్చడం లాంటిదని పేర్కొన్న కవిత… ఇది వారి అజ్ఞానాన్ని బయట పెడుతుందని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News