- Advertisement -
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్ర కాలువ తండా కొత్తపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రూలర్ ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఎర్ర కాలువ తండా కొత్తపేట గ్రామానికి చెందిన నానావత్ హరియా అనే రైతు ఒక ఎకరం పది గుంటల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.ఎప్పుడు లాగానే గురువారం ఉదయం 9 గంటల సమయంలో తన కూతురు అరుణను చూడాలని ఉందని ఇంటి వద్దకు రమ్మని ఫోన్ చేసి పొలం వద్దకు వెళ్లి వేప చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాంలో పొలానికి నీళ్లు సరిగ్గా పారడం లేదని, ఆర్థిక, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -