Wednesday, January 15, 2025

రైతుకు వజ్రం రూపంలో అదృష్టం

- Advertisement -
- Advertisement -

అడపా దడపా వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీయ జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలోని ఒక రైతుకు తన పొలంలో అత్యంత విలువైన వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని దక్కించుకునేందుకు వజ్రాల వ్యాపారులు ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. వజ్రం కోసం పోటీ పడ్డారు.వజ్రం అత్యంత నాణ్యమైనది కావటంతో దీనికి రూ.25లక్షల విలువ కట్టారు.కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మదనంతపురానికి చెందిన ఈ రైతుకు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. ఒక వ్యాపారీ పోటీలో రూ.18లక్షలు నగదుతో పాటుగా పది తులాల బంగారం కూడా చెల్లించి ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఈ వజ్రం విలువ సుమారు 30లక్షల రూపాయలు పైగానే ఉంటుందని చెబుతున్నారు.కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవివకాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలుపెట్టారు.

తుగ్గలి మండలంలోని తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, గిరిగెట్ల, మదనంతపురంలో వజ్రాల కోసం గాలిస్తారు. మద్దికెర మండలంలోని పెరవలి, మద్దికెర, బసినేపల్లి ప్రాంతాల్లో కూడా వెతుకుతారు. ఇటు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్, బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి తదితర ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలైంది. వర్షాలు బాగా కురవగానే జనాలు పొలాలబాటపడతారు. ప్రతి ఏటా విలువైన వజ్రాలు దొరుకుతుండటంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వెతుకుతుంటారు. పొలాల్లో దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు.. వ్యాపారులు కూడా ఆ దగ్గరలోనే మకాం వేస్తారు. కొన్ని సందర్భాల్లో వేలం పాట నిర్వహించి వ్యాపారులు ఆ వజ్రాన్ని దక్కించుకుంటారు. అయితే ఇలా దొరికిన వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్క చేసి.. ఆ విలువకు తగిన విధంగా డబ్బులతో పాటుగా బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News