Friday, December 20, 2024

అన్నదాతకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నెక్కొండ మండలంలోని గొట్లకొండ గ్రామ శివారు మామిడితోట తండాకు చెందిన ఓ రైతు శనివారం విద్యుత్ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు, తండావాసుల కథనం ప్రకారం.. మామిడితోట తండాకు చెందిన ఇస్లావత్ శ్రీను, తన భార్య కవితతో కలిసి వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మోటారుకు కరంటు సరఫరా కాకపోవడంతో విద్యుత్ స్తంభం ఎక్కి జంపర్ కలిపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై స్తంభంపై వేలాడుతూ ఉన్నాడు. కాగా అదే సమయంలో కరంటు పోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అంతలోనే శ్రీను స్పృహలోకి రావడంతో తన భార్యతో పాటు పక్కనే ఉన్న రై తులు చీరతో కిం దకి దించారు. ఎడమ కాలి కి, చేతికి తీవ్రగాయాలు కావడ ంతో చి కిత్స ని మిత్తం వరంగల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News