Sunday, December 22, 2024

జాలిగామలో దారుణ హత్య.. గ్రామంలో ఉద్రిక్తం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ జోన్: ఇంటిఆరు బయట నిద్రిస్తున్న వ్యక్తిని గత రాత్రి సమయంలో గుర్తు తెలియిన దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు హతుడు కామల్ల సత్తయ్య(45)గా గుర్తించారు. గురువారం రాత్రి హతుడు సత్తయ్య తన ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో అతని తలపై గుర్తుతెలియని దుండగులు బండ రాళ్లు లేదా కర్రలతో బాది హత్యచేసినట్లు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఈ దారుణ సంఘట న వెలుగులోకి రావటంతో కొందరు పోలీసులకు సమాచారం అందచేశారు. వెంటనే గజ్వేల్ ఎసిపి రమేష్ ,సిఐ వీరప్రసాద్‌లు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, సంఘటనా స్థలంలో ఉన్న పరిస్థితిని పరిశీలించారు.

సంఘటన పూర్వాపరాలను పోలీలు ప్రాధమికంగా ఆరాతీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలోని ఒక వ్యక్తే ఈ హత్యకు కారణమన్న అ నుమానంతో హతుని కులస్తులు, గ్రామస్తులు కలిసి పెద్ద ఎత్తున అనుమానితు ని ఇంటి చుట్టూ గుమికూడటంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడ్డది. సమాచారం అం దుకున్న పోలీసులు వెంటనే అక్కడ గొడవ చేస్తున్న గ్రామస్తులను సముదాయిం చి అక్కడినుంచి పంపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చే సుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నారు. దాంతో మరో దారు ణం తప్పిందని పలువురు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. సంఘటనా స్థలాని కి డాగ్ స్వాడ్‌తో పాటు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాల కోసం గాలింపు చ ర్యలు చేపట్టారు.

సంఘటనా స్థలంలో ప్రాధమిక విచారణ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సత్తయ్య మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హతుడు సత్తయ్యకు భార్య యాదమ్మతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. హతుని కుమారుడు కామల్ల కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటు ఎసిపి రమేష్ తెలిపారు. జరిగిన ఈ హత్యకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని ఆయన చెప్పారు. ఈ హత్య సమాచారం తెలిసిన ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, జడ్పీటిసి మాజీ సభ్యుడు బొ ల్లారం ఎల్లయ్య, సర్పంచ్ శివయ్య, ఎంపిటిసి రాజిరెడ్డి తదితరులు మృతదేహా న్ని పరిశీలించారు. హతుని కుంటుంబాన్ని వారు పరామర్శించారు. ఇదిలా ఉండగా గ్రామంలో భూతగాదాల నేపధ్యంలో సుమారు రెండు నెలల కిందట ఒ క హత్య సంఘటన చోటు చేసుకుందని, ఇంతలోనే ఇది రెండో హత్య జరగటం యాధృచ్ఛికం అయినప్పటికీ గ్రామంలో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News