మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రైతాంగానికి సాగునీళ్లు లేవు. కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు. అందుకే మనం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదా న్ని ముందుకు తీసుకుపోతున్నాం. రైతు సమస్యల పరిష్కారానికి రైతుల్లో ఐక్యత రావాలే అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్‌తో పాటు పలువురు రైతు నేతలు తెలంగాణ భవన్‌లో శనివారం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సిఎం కెసిఆర్ గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ‘అప్నా డంగ్ చాహియే, అప్నా రం గ్ చాహియే, అప్నా జంగ్ చాహియే’ అని అన్నా రు.
ఈ దేశంలో రైతులు మరో 75 ఏళ్లు ఆందోళనలు, పోరాటాలు చేసినా ఈ పాలకుల్లో ఉలుకురాదనీ ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. మన పరిస్థితి ఇట్లానే ఉంటది. మనం చేయాల్సిందల్లా మన చేతిలో ఉన్న పవర్ ఫుల్ ఓటును వినియోగించుకొని రైతు రాజ్యాన్ని తెచ్చుకోవాలని కెసిఆర్ సూచించారు. మన చేతిలో ఓటు అనే అస్త్రం ఉండగా రోడ్ల మీద ఆందోళనలు పోరాటాలు అక్కర లేదనీ, లాఠీ దెబ్బులు తూటాలు తినాల్సిన అవసరం లేదని, నిమ్మలంగా మన ఆయుధమైన ఓటును వాడుకుంటే సరిపోతుందని, మన ఓటు మనం వేసుకుంటే రైతు రాజ్యం వస్తదని, మనల్ని మనం బాగుచేసుకుంటామని, ఇందుకు గట్టి సంక ల్పం, శుద్ది, బుద్ధి కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. గతంలో ‘షెట్కారీ కామ్ పార్టీ ’ పోటీ చేసి మహారాష్ట్రలో 76 సీట్లు గెలిచిందని, మనం ఇప్పుడు 200 సీట్లు గెలుస్తమని, అందుకు గట్టి సంకల్పం కావాలే అని కెసిఆర్ స్పష్టం చేశారు.