Monday, December 23, 2024

నా అరెస్టు కొత్త విప్లవం తేగలదు: రాకేశ్ టికైత్‌

- Advertisement -
- Advertisement -

 

Rakesh Tikait

ఢిల్లీ: నిరసనలో పాల్గొనేందుకు దేశ రాజధానిలో అడుగుపెట్టిన తనను ఢిల్లీకి వెళుతుండగా నిర్బంధించారని రైతు నాయకుడు రాకేష్ టికైత్ ఆదివారం ట్వీట్ చేశారు. ఒక పోస్ట్‌లో, టికైత్ తనను “అరెస్టు” చేసారని తెలిపారు. ఢిల్లీ పోలీసులు “కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు” అని పేర్కొన్నారు. రైతులు వెనక్కి తగ్గబోరని నొక్కి చెప్పారు.

‘‘ఢిల్లీ పోలీస్ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. రైతుల గళాన్ని అది ఆపలేదు. నా ఈ అరెస్టు ఓ కొత్త విప్లవాన్ని తీసుకురాగలదు. ఈ ఉద్యమం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఆగబోము, తలవొగ్గబోము’’ అని ఆయన ట్విటర్ లో పేర్కాన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతుండడంపై  భారత కిసాన్ యూనియన్ సోమవారం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్న నేపథ్యంలో రాకేశ్ టికైత్ ను అరెస్టు చేశారు. ఇదిలావుండగా రాకేశ్ టికైత్ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఖండించారు.  ఆయన ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News