Wednesday, January 22, 2025

రైతు మృతిని హత్య కేసుగా నమోదుకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళన సాగిస్తున్న రైతు మృతి చెందడంపై సంయుక్త కిసాన్ మోర్చా గురువారం తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. ఈ మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనను ఖండిస్తూ బ్లాక్‌డేగా ప్రకటించింది. దీనికి నిరసనగా ట్రాక్టర్ మార్చ్ చేపట్టడానికి నిర్ణయించింది. బుధవారం నాడు రైతుల ఆందోళనలో పాల్గొన్న 21 ఏళ్ల శుభకరణ్ సింగ్ హర్యానా పోలీస్‌లకు, పంజాబ్ రైతులకు మధ్య తలెత్తిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ సంగూర్ జిల్లాలో ఖనౌరీ సరిహద్దు పాయింట్ దగ్గర ఆ రైతు ఢిల్లీ మార్చ్ ఆగిపోయింది. గురువారం నాడు ఇక్కడ నిర్వహించిన రైతుల సమావేశం తరువాత సంయుక్త కిసాన్ మోర్చా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. ఈనెల 26 న దేశం మొత్తం మీద జాతీయ రహదార్లపై ట్రాక్టర్ ర్యాలీలను రైతులు చేపడతారని,

మార్చి 14న ఢిల్లీ లో మహాపంచాయత్ నిర్వహిస్తారని వెల్లడించింది.పోలీస్‌ల దమనకాండకు నిరసనగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ దిష్టిబొమ్మలను శుక్రవారం దగ్ధం చేయడమౌతుందని ప్రకటించింది. ఖనౌరీ సరిహద్దులో రైతు మృతి చెందడాన్ని హత్య కేసుగా నమోదు చేయాలని, ఆ రైతు కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారంగా అందజేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఢిల్లీ ఛలో పిలుపుపై వేలాది మంది రైతులు తరలి వచ్చి శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో తిష్టవేయడాన్ని గురువారం సమావేశంలో సమీక్షించారు. పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాల ఎస్‌కెఎం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News