Monday, December 23, 2024

రైతు రుణమాఫీ, రైతుల సమస్యలపై పెరాడాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పశుసంవర్ధ్దక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డి నియోజకవర్గ పర్యటన సందర్భంగా బిబిపేట్ మండలం పెద్దమ్మ కళ్యాణ మండపంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిద మోర్చాల మండల అధ్యక్షుల, జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతు పార్టీ శ్రేణులు, వివిద మోర్చాల నాయకులు కలసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతుల సమస్యలపై కిసాన్ మోర్చా నాయకులు పోరాడాలని అన్నారు. మహిళల సమస్యలపై మహిళా మోర్చా కార్యక్ర మాలు నిర్వహించాలని చెప్పారు. ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ బృతి విషయంలో యువ మోర్చా ఉద్యమం ఉదృతం చేయాలని అన్నారు. అన్ని మోర్చాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విదానాలపై పోరాడాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News