Friday, December 20, 2024

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి 2లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం గుర్రంపోడ్‌మండల కేంద్రంలో పాద యాత్ర సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 500ల రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను అందజేయడం జరుగుతుందని అన్నారు.

అదేవిదంగా రేషన్ కార్డు ఇవ్వడంతోపాటు గతంలో కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి అందజేయడం జరుగుతుందని ,భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలకు కూలీ బంధు కింద సంవత్సరానికి 12వేల రూపాయల నగదు అందజేస్తామని అన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులను గురించి భట్టి విక్రమార్కకు తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని , పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు నిరుపేదలకు ఇళ్లు, నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. మండలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కలిసిన తరువాతనే జానారెడ్డి హయాంలో జరిగిన అభివృధ్ది తప్ప ఈ 9సంవత్సరాలలో మండలంలో ఎలాంటి అభివృధ్ది కార్యక్రమాలకు నోచుకోలేదని రాష్ట్ర నాయకులు కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో , కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్,మండల అధ్యక్షులు తగుల సర్వయ్య యాదవ్, యూత్ అధ్యక్షులు సూదిని జగదీశ్వర్‌రెడ్డి, మండల నాయకులు కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, జాల చిన సత్తయ్య యాదవ్, వడ్డగోని యాదగిరి గౌడ్, ఎంపిటిసి కుప్పా రాములు గౌడ్, అమరేందర్‌గౌడ్, ఎస్సీ సెల్ నాయకులు బొడ్డు కిరణ్,మేడి వెంకన్న, మండ లింగయ్యయాదవ్, నాగరాజు,కమతం జగదీశ్వర్‌రెడ్డి సర్పంచులు, ఎంపిటిసిలు , అభిమానులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News