Sunday, December 22, 2024

రైతు ఋణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలి : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ రుణమాఫీ ప్రకటించారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీ 4 సంవత్సరాలు ఆలస్యం అయ్యిందని, అందుకు వడ్డీతో సహ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిదుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసిందని, రుణమాఫీ అమలు చేయకపోతే బ్యాంక్ ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించామని గుర్తు చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందేవరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News