- Advertisement -
వరంగల్ అర్బన్: అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లో అధికంగా ఉండడంతో ఇండ్లలో భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పాటు గ్రామానికి ఆనుకొని ఉండే పంట చేన్లను సైతం నష్టం చేస్తున్నాయి. కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ములుగు జిల్లా మహమ్మద్‌గౌస్‌పల్లి గ్రామ శివారులో ఎర్రబెల్లి సదయ్య అనే రైతు ఊరికి ఆనుకొని తన పత్తి చేను ఉండడంతో కోతులు పత్తి కాయలను తెంపుతూ పంట చేను ఆగం చేస్తున్నందున కొండెంగ వేషం వేశాడు. తన పంటను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు కొండెంగ పులి బొమ్మలతో ఉన్న దృశ్యం ‘మనతెలంగాణ’ కెమెరా క్లిక్ మనిపించింది.
- Advertisement -