Wednesday, January 22, 2025

రైతు ‘మార్షల్’ కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నష్టాల్లో కూరుకుపోయిన దేశ రైతాంగానికి తెలంగాణ ప్ర భుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అత్యవస రమని షేట్కారీ సంఘటన్ యువ కూటమి మహారాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్‌రావు బిందు స్పష్టంచేశారు. బి ఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావును రైతుల మార్షల్ అని సంభోదిస్తూ లేఖ రాశారు. దేశ రైతాంగం నిస్సహాయస్థితిలో ఉందని, రైతులు ఓ డిపోయారని ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థ్ధికవేత్త, రై తు నాయకుడు శరద్‌జోషి తన చివరి రోజుల్లో అనేవారని సుధీర్ సుధాకర్‌రావు గుర్తుచేశారు. యూరఫ్ దేశాల వ్యవ సాయ రంగం నిస్తేజంగా ఉన్నప్పుడు అమెరికా జనరల్ మార్షల్ రూపొందించిన విధానాలు అమలు పరిచి అభి వృద్ధి చెందాయని, ఇప్పుడు భారతదేశానికి రైతులపట్ల, వ్య వసాయం పట్ల సమగ్ర అవగాహన, నిబద్దత, అంకితభా వం ఉన్న జాతీయ నాయకుడు రావాల్సిన అవసరం ఉం దని, అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సేవలు దేశ రైతాంగానికి ఎంతో అవసరం ఉందని సుధీర్ సుధాకర్‌రావు పేర్కొన్నారు.

మహారాష్ట్ర షేత్కారీ రైతు సంఘటన్‌తో పాటుగా జాతీయ రైతు సంఘాలకు చెందిన 52 మంది జాతీయ నాయకుల సంతకాలతో కూడిన లేఖను సీఎం కెసిఆర్‌కు రాశారు. రైతుల మార్షల్ కెసిఆర్ అని ఆ నాయకులు కొనియాడారు. తన మార్షల్ ప్లాన్‌ను అమలు చేయడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 2014లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శరత్‌జోషి చర్చించారని, కానీ ఫలితం లేకుండా పోయిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు విద్యుత్, సారునీరు, బహిరంగ మార్కెట్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రుణామాఫీతో పాటుగా వ్యవసాయంలో 3 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా ఇవ్వాలని కూడా ఆనాడు శరత్‌జోషీ చెప్పారని, కానీ నాటి మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో రైతులకు పెట్టుబడిసాయంకింద రైతు బంధు పథకం, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తుండటం, సాగునీరు, రుణమాఫీలు, మౌలిక సదుపాయాల కల్పనలు భారీగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అందుకే కొద్దిరోజుల నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాల ప్రజలను తమతమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కూడా డిమాండ్‌లు చేస్తున్నారని, దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు ఎంతటి ప్రజాదరణ ఉందో అర్ధంచేసుకోవాలని కోరారు. ఒక రాష్ట్ర పౌరులు మరో రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే డిమాండ్ గురించి తాము చాలా ఆసక్తిగా అధ్యయనం చేశామని తెలిపారు. ఈ డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకునేందుకు కొన్ని సహకార సంఘాలతో పాటుగా శ్రీ నర్సింగ్ దేశ్‌ముఖ్, మరికొందరు జర్నలిస్టులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక యాత్ర, పర్యటనలు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 గ్రామాల్లో తయ యాత్ర సాగిందని, ప్రతి గ్రామంలో ప్రజలు తెలంగాణ ప్రభుత్వం తమ పౌరులకు, రైతులు, దళితులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులకు అందజేస్తున్న నాలుగు వందలకు పైగా పథకాల గురించి చెప్పారని ఆ లేఖలో వివరించారు. ముఖ్యంగా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం గురించి అన్ని చోట్లా ప్రస్తావించారని తెలిపారు.

రాష్ట్రం ఏర్పాటైన 8 ఏళ్ళల్లో తెలంగాణలో రైతుల ఆర్ధిక పరిస్థితిలో వచ్చిన మార్పు గురించి చాలామంది చెప్పారని వివరించారు. అందుకే ఈ పథకాలు నిజంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందా? లేదా? అనే ఆసక్తి తమకు కలిగిందని తెలిపారు. ఇదే విషయంపై పూర్తిగా తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చామని వివరించారు. అప్పులు ప్రజలు తమకు ప్రతి పథకాన్ని చూపించి తమ సందేహాన్ని నివృత్తి చేశారని, వీటన్నింటిలో ప్రత్యేకత ఏమిటంటే ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని అందరూ చెప్పారని రైతు నాయకులు ఆ లేఖలో వివరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మీరు (కెసిఆర్), మీ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి, ఆ పథకాలన్నీ శరద్‌జోషి సూచించారని, ఇది మార్షల్ ప్లాన్ లాంటిదేనని వివరించారు.

కెసిఆర్ గారూ మీరు మా దృష్టిలో భారతీయ రైతులకు మార్షల్

తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పడుతున్నాయని, ఇది చాలా పెద్ద విజయమని కీర్తించారు. అందుకే దేశం నలుమూలల నుంచి రైతులు మీ పథకాల నుంచి ప్రయోజనాలు పొందాలి.. అని ఆకాంక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్రంలో ప్రతిరోజూ సగటున ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని, మహారాష్ట్రంలో మీ రాకకు సంబంధించిన ఉనికి అక్కడి రైతులను ఉత్తేజపరుస్తున్నదని తెలిపారు. దీన్ని మీరు గమనించినట్లయితే నాందేడ్‌లో మీ సమావేశం తరువాత నాందేడ్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, ఇది వాస్తవమని తెలిపారు.

మీ (కెసిఆర్) రాకతో మంచి జరుగబోతోందని, ఇంది ఎంతో ఊరటనిచ్చే విషయమని మహారాష్ట్ర రైతులు భావిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర రైతు బాంధవుడు శరద్‌జోషి మరణించిన తర్వాత, రైతు ఉద్యమంలో పనిచేస్తున్న రైతులెందరో మాలాంటి నాయకులు, శ్రామికులు ముందు ఓ ప్రశ్న నిలిచిందని, ఇప్పుడు మనం ఎవ్వరితో కలిసి పనిచేయాలో తెలియని అయోమయం నెలకొన్నదని, మహారాష్ట్రలోని ప్రతి జిల్లాలో రైతు ఉద్యమంలో పనిచేస్తున్న ప్రతిచిన్న, పెద్ద నాయకుడిని, కార్మికులు మీతో కలిసి పనిచేయాలని మా రాష్ట్ర రైతు సంఘం నాయకులు మాణిక్‌రావు కదమ్ మీ దగ్గరకు వచ్చారని గుర్తు చేశారు. మీ ఇద్దరి సమావేశాల తర్వాత మహారాష్ట్ర రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయని తెలిపారు. బహిరంగ సభల్లో పలు సందర్భాల్లో రైతులను, ప్రజలను ఉద్దేశించి మీరు చేస్తున్న విజ్ఞప్తులపై మహారాష్ట్రలోని సామాన్యులు కూడా చలా ఆలోచిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News