Sunday, December 22, 2024

రైతు బాంధవుడు స్వామినాథన్ : ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు బాంధవుడు ఎం ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో పంటల సమృద్ది, ఆహార అభివృద్ధి, భద్రత, మహిళా రైతుల స్వయం సమృద్ధి కి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్ననాని మంత్రి తెలిపారు.

స్వామినాథన్ మృతి తీరని లోటు : ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్
పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం.. చాలా బాధకరం అని ఎంపి సంతోష్‌కుమార్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన సేవలను సంతోష్ పోస్టు చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వ్యవసాయంలో మహిళలను ఉద్ధరించాలనే ఆయన నిబద్ధత, మక్కువ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

స్వామినాథన్ కృషి చిరస్మరణీయం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్
హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి తీరని లోటు అని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లు తీవ్రవిచారం వ్యక్తం చేశారు. జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తదితర అంశాల్లో వారు చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. వ్యవసాయరంగంలో జరిగే పరిశోధలనకు ఆయన ఓ మార్గదర్శి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News