Sunday, January 19, 2025

చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: గాయపడిన ఓ చిరుత పులిని రైతు పట్టుకొని తన బైక్‌కు కట్టుకొని ఆస్పత్రికి తరలించిన సంఘటన కర్నాటక రాష్ట్రం హసన్ ప్రాంతం అరాసికర్ తాలూకాలో జరిగింది. చిరుత పులి రైతును రక్కడంతో చిన్నపాటి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాగివాలు గ్రామంలో వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే రైతు ఉండేవాడు. ముత్తు తనకున్న కొబ్బరి తోటకు వెళ్లాడు. కొబ్బరి తోటలో ఓ మూలన జంతువు కనిపించడంతో దాని దగ్గరికి వెళ్లాడు. చిరుత శక్తిని అంతా కూడగట్టుకొని అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. దీంతో చిరుత అనారోగ్య సమస్యలు ఉన్నాయని గమనించిన ముత్తు ఓ తాడు తీసుకొని చిరుత రెండు కాళ్లను కట్టేశాడు.

Also Read: మెడికల్ మిరాకిల్: తెగిపడిన బాలుడి తలను అతికించారు..

చిరుత కట్టే క్రమంలో అతడిపై అది రక్కడంతో చేతులపై గాయాలయ్యాయి. వెంటనే చిరుతను తన బైక్‌కు కట్టుకొని ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు చిరుతను ముత్తు దగ్గర నుంచి తీసుకొని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ముత్తు స్వల్పంగా గాయపడడంతో జెసి ఆస్పత్రికి తరలించారు. దీంతో ముత్తును అటవీ శాఖ అధికారులు అభినందించారు. అతడికి అటవీ శాఖ అవార్డు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుత వయసు ఎనిమిది నెలలు ఉంటుందని అటవీ శాఖ అధికారి హేమంత్ తెలిపాడు. శుక్రవారం హోషహళ్లి గ్రామంలో మూడు సంవత్సరాల వయసు ఉన్న చిరుత పులిని అటవీ శాఖ అధికారుల పట్టుకున్న విషయం తెలిసిందే. చిరుతను బైక్‌కు కట్టుకొని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News