Sunday, December 22, 2024

గోవును కాపాడిన గుజరాత్ రైతన్న

- Advertisement -
- Advertisement -

వెరావాల్ : గుజరాత్‌లోని ఓ గ్రామరైతు తన ఆవు ఆడసింహానికి ఆహారం కాకుండా రక్షించుకున్నాడు. ఈ ఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని అలిదర్ గ్రామ శివార్లలో జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న రైతుకు పక్కన కొట్టంలో తన ఆవు అరుపులతో మెళకువ వచ్చింది. కిటికీలో నుంచి చూడగా ఓ సింహం వచ్చి ఆవును చంపితినేందుకు యత్నించింది. ఈ లోగా ఆవు కట్టుతెంచుకుని బయటకు పరుగులు తీసింది. దీనిని వెంబడించిన సింహం ఆవు మెడను నోటకరుచుకుంది.

దీనిని గమనించిన రైతు అక్కడ ఉన్న రాయి విసిరాడు. దీనితో తనకు ఏదో తగులుతున్నదనే భయంతో సింహం ఈ గోవును వీడి పక్కనున్న పొదల్లోకి జారుకుంది. సంబంధిత ఘటన సమీపంలోనే గిర్ అభయారణ్యంలో అత్యధిక సంఖ్యలో ఆసియా సింహాలు ఉన్నాయి. ఈ ఘటన దశలో అటుగా వెళ్లుతున్న ఓ కారులో నుంచి సెల్‌ఫోన్ ద్వారా ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. స్థానిక బిజెపి నేత వివేక్ కొటాడియా ఈ వీడియోను ట్విట్టర్‌లో వెలువరించారు.

Also Read: కేంద్రంపై సుప్రీంలో ఆప్ పిటిషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News