Friday, November 22, 2024

26న భారత్ బంద్: రైతు సంఘాల ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈనెల 26న పూర్తి స్థాయి భారత్ బంద్ చేపట్టనున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలపై తాము సాగిస్తున్న ఆందోళన ఆ తేదీ నాటికి నాలుగు నెలలు పూర్తికావస్తున్నందున భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్టు రైతు నేత బూటాసింగ్ తెలిపారు. 26 వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా బంద్ కొనసాగుతుందని వివరించారు. పెరిగిన చమురు ధరలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15న ట్రేడ్ యూనియన్లతో కలసి ఆందోళనలో పాల్గొంటామని చెప్పారు. మార్చి 29న హోలీకాదహన్ పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేయనున్నట్టు చెప్పారు.

Farmer Unions Call for Bharat Bandh on March 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News