Sunday, April 13, 2025

రైతుమేళాను రైతులు సందర్శించాలి: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెలలో ప్రతి జిల్లాలో రైతు మేళాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుమేళా సందర్శించి పలు స్టాళ్లను తుమ్మల పరిశీలించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రైతు మహోత్సవంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రైతుమేళాను ప్రతి రైతు సందర్శించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు సాగు దిశగా రైతుల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులు వాడాలని తెలియజేశారు. అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలు దేరారు. వనజీవి రామయ్య కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులను తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News