Tuesday, November 5, 2024

ఇది రైతుల విజయం: హరీష్ రావు

- Advertisement -
Farmer won on modi govt
హైదరాబాద్: రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల‌ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల‌ విజయమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గత సంవత్సరం నుంచి బుల్లెట్ లకు, లాఠీలకు, వాటర్ కానన్ లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన రైతుల తీరు అద్భుతమని ప్రశంసించారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారని, ఇది దేశ ప్రజల విజయమన్నారు. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలని హరీష్ రావు కొనియాడారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News