Wednesday, January 22, 2025

సన్నాల కొనుగోలులో జాప్యంపై భగ్గుమన్న రైతన్న

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఎల్లారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన 20 రోజులకు తూకం ప్రారంభం కావడం.. అది కూడా దొడ్డు ధాన్యాన్ని మాత్రమే తూకం వేయడం… సన్నరకాలను కొనుగోలు చేయకపోవడం పట్ల ఆగ్రహించిన రైతన్నలు జాయింట్ కలెక్టర్‌పై తిరగబడేందుకు యత్నించారు. ఈ సంఘట న కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, అ న్నాసాగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ధాన్యం కొనుగోలులో అధికారుల వివక్షను ఎండగడుతూ రోడ్డెక్కి ధర్నా చేస్తే తప్ప తమకు న్యాయం జరగదని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం అం దుకున్న జాయింట్ కలెక్టర్ విక్టర్ సంబంధిత అధికారులు, ఆఘమేఘాల మీద సంఘటన స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు జాయింట్ కలెక్టర్‌పై తిరుగబడినంత పనిచేశారు. సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు కేంద్రం వద్ద బ్యాగుకు కిలో 600 గ్రాముల ధాన్యాన్ని ఎక్కువ తూకం వేసినా రైస్‌మిల్లర్‌లు లోడ్‌కు 5 క్వింటాళ్ల తరుగు తీస్తున్నారని పలువురు రైతులు జెసికి విన్నవించారు. అంతేకాకుండా రవాణా సమస్యగా కూడా చాలా విపరీతంగా ఉండడం, లారీలో లోడ్ చేసిన ప్రతి సంచికి లారీ డ్రైవర్ రూపాయి డిమాండ్ చేయడం.. రైస్‌మిలర్లు మాయిశ్చర్‌పై సమస్యలు సృష్టించడం, ఇతర సమస్యలతో విసిగిపోయిన అన్నాసాగర్ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద జాయింట్ కలెక్టర్ ఎదుట ధర్నా చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో జెసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో డిసిఒ రాంమోహన్, సిఎస్‌ఒ నర్సింహారావ్, డిఎం రాజేందర్, ఎల్లారెడ్డి డిఎస్‌పి శ్రీనివాసులు, ఎస్‌ఐ బొజ్జ మహేశ్, తహశీల్దార్ అల్లం మహేందర్, గిర్దావర్ శ్రీనివాస్, గ్రామానికి చెందిన నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News