Monday, December 23, 2024

సాగు పనుల్లో రైతన్నలు బిజీ బిజీ

- Advertisement -
- Advertisement -

కుంటాల : మండల వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు జోరందుకుంది. వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఎటు చూసినా పత్తి సోయా పంటలను వేసుకుంటున్నారు. మృగశిర కార్తే 15 రోజులు గడిచిన వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందిన రైతులు వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 15 గ్రామపంచాయతీలలో అత్యధికంగా పత్తి, సోయా పంటలను వేసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు.
తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు : స్థిరమైన నమ్మకమైన రాబడి ఇచ్చే పంట పత్తి, సోయా పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 75 శాతం మేర రైతులు పంటలను సాగు చేశారు. రెండు మూడు రోజుల నుండి వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.
యాజమాన్య పద్దతిలో సాగు చేస్తే అధిక లాభాలు: రైతులు యాజమాన్య పద్దతిలో పత్తితో పాటు సోయా సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆధునిక పద్దతిలో సాగు చేసి మంచి దిగుబడులు సాధించే ఉద్దేశంతో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పొందుతున్నారు. గతంలో కంటే ఈ యేడు 7 వేల ఎకరాలలో పంటల సాగు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News