Monday, January 20, 2025

రైతుబంధుపై రైతాంగం హర్షం

- Advertisement -
- Advertisement -

శ్రీరంగాపురం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఈ నెల 26 నుంచి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం పట్ల రైతాంగం ఆనందరం వ్యక్తం చేస్తుందని రైతు బంధు మండల అధ్యక్షుడు గౌడ నాయక్ అన్నారు.

బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతు బీమాతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలకు రైతుల పక్షాన ఆయన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News