కాసిపేట: దేశానికి అన్నం పెట్టెది రైతులేనని, దేశానికి వెన్నముక రైతులే అని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 95 మంది గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలను వారు అందజేసారు. దేవాపూర్ పంచాయితీలో 6గురు రైతులకు 12 ఎకరాలు, వెంకటాపూర్ పంచాయితీలో 62 మందికి 42.03 ఎకరాలు, సోనాపూర్ పంచాయితీలో 12 మందికి 24.20 ఎకరాలు. లంబాడితండా(డి)పంచాయితీలో 9 మందికి 10 ఎకరాలు, వరిపేటలో 6గురికి 19.20 ఎకరాలు మొత్తంగా 95 మందికి 126 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుచు దేశంలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ది కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నొ రకాల ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు. గ్రామాలలో ఉన్న చెరువులను మిషన్ కాకతీయ ద్వారా మరమ్మత్తులు చేయించడం జరిగిందన్నారు. నాడు బోర్లు ఎండిపోయి నోర్లు తెరిచేవని నేడు ఎక్కడ బోరు వేసిన 50 అడుగుల నుండి నీరు ఉబికి వస్తుందని ఆయన అన్నారు.
అన్ని ప్రాజెక్టులలో ప్రభుత్వం నీరు నిలువ చేయడం వల్ల భూగర్భ జలాలు సంవృద్దిగా ఉన్నాయని ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం వల్లే సాద్యం అయిందన్నారు. నేడు కూరగాయల ధరలు ఆకాశానికి ఎగిసిపడి సామాన్యులు అతాలకుతం అవుతున్నారని అందు వల్ల రైతులు పంటల మార్పిడి చేయాలని వారు సూచించారు. కేవలం పత్తి, వరి పంటలు మాత్రమే వేయడం వల్ల నేడు ఆహార ఉత్పత్తుల, కూరగాయల ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయని వారు అన్నారు.
రైతులు పంటలు మార్పిడి చేయడం వల్ల రైతులకు లాభం జరుగుతుందని, ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయని వారు సూచించారు. నేడు పోడు భూములకు పట్టాలను అందించిన రైతులకు ప్రభుత్వం ఖరీఫ్ రైతు బందు పథకంను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎస్‌టిలతో పాటు గిరజనేతరులు కూడా పోడు భూ-ములు సాగు చేసుకుంటున్నారని ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు ఎంఎల్‌ఎ చిన్నయ్య తెలిపారు.
ఈ విషయంలో అర్హులైన వారికి కూడా పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని హామి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం పని చేస్తున్న వారిని ప్రజలు, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గౌతమి, ఆర్‌డివో శ్యామలదేవి, మార్కెట్ కమిటి చైర్మెన్ నిరంజన్‌గుప్తా, జడ్‌పిటిసి పల్లె చెంద్రయ్య, వైస్ ఎంపిపి పుస్కూరి విక్రంరావ్, సర్పంచ్‌లు ఆడె సౌందర్య శంకర్, దేవి కొండయ్య, అజ్మీర తిరుపతి, ఆడె బాదు, సాపాట్ శంకర్, రాంటెంకి శ్రీనివాస్, మక్కల శ్రీనివాస్, లావుడియా సంపత్, భుక్యా సునిత, ఎంపిటిసిలు అక్కెపల్లి లక్ష్మీ బుగ్గరాజ్, నవనందుల చంద్రమౌళీ, కొండబత్తుల రాంచెందర్, పిఎసిఎస్ చైర్మెన్ బదావత్ నీలా రాంచెందర్, ఎంపిడివో ఎంఎ. అలీం, తహాసిల్దార్ దిలిప్‌కుమార్, వ్యవసాయ శాఖ ఎవో వందన విస్తరణ అధికారులు దివ్య, అంజలి, పోషం తదితరులు పాల్గోన్నారు.