చంఢీగర్: హర్యానాలో బిజెపి ఎంపి రామ్ చందర్ జంగ్రా కారుపై కొంతమంది రైతులు దాడి చేశారు. శుక్రవారం హిస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఎంపి రామ్ చందర్ వాహనాన్ని కొంత మంది రైతులు అడ్డుకుని నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తూ ఎంపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది రైతులు ఎంపి కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు, రైతులను అడ్డుకుని ఎంపిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఈ ఘటనపై ఎంపి డిజిపికి ఫిర్యాదు చేశారు. తన వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, తనను చంపేందుకు ప్రయత్నించారని రైతులపై ఎంపి డిజిపికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
Farmers Attack on BJP MP in Haryana