Wednesday, January 22, 2025

చోరీలకు పాల్పడుతున్న దొంగపై రైతుల దాడి.. దొంగ మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులకు దొంగల వల్ల కూడా ఇబ్బందులు తప్పడం లేదు. గుమ్మ‌డిద‌ల శివారులో ఉన్న పంట పొలాల్లోకి ఓ వ్య‌క్తి స్టార్ట‌ర్లు, విద్యుత్ తీగ‌ల‌ను చోరీ చేసేందుకు య‌త్నించాడు. అక్క‌డే ఉన్న రైతులు దొంగ‌ను గ‌మ‌నించి అదుపులోకి తీసుకుని, దేహ‌శుద్ధి చేశారు. ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది. దొంగను కొట్టుకుంటూ రైతు సంఘం కార్యాల‌యానికి తీసుకు వచ్చారు. రైతుల చేతిలో దెబ్బలు తిన్న దొంగ కాసేప‌టికే మృతి చెందాడు. మృతుడిని మ‌ల్లేశ్‌ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై గుమ్మ‌డిద‌ల పోలీసులు కేసున‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News