Thursday, January 23, 2025

రైతు బీమా… కుటుంబానికి దీమా

- Advertisement -
- Advertisement -

మణుగూరు : రైతు బీమాతో రైతన్న కుటుంబానికి అండగా సిఎం కెసిఆర్ నిలుస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బుధవారం మణుగూరు మండలంలోని ఎంఎల్‌ఏ క్యాంప్ కార్యాలయంలో ఆయన జూపల్లి యాదమ్మ, తాటి పాపయ్య, ఏనిక అనసూర్య, తెల్లం శ్రీరాములు ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రైతు బీమా చెక్కులను ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున మొత్తం 20లక్షల రూపాయల విలువలు చెక్కులను వారి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, కరకగూడెం, పినపాక, మణుగూరు మండలాలలో 2018 నుంచి 2022 వరకు 679 మంది రైతులకు 33కోట్ల 95లక్షల రూపాయల పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతు అకారణంగా మరణం చెందితే ఆ రైతు కుటుంబాలకు బీమా ఉండాలని ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా అమలు చేస్తున్నదన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతులు కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒకటి రైతు బీమా అని అన్నారు.

రైతుబంధు పథకంలో పాటు రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు ఎవరైనా అనుకొని ప్రమాదం వద్ద మరణిస్తే వారి కుటుంబానికి రూ 5లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రైతు బంధు పథకానికి అర్హులైన రైతులందరూ కూడా రైతు బీమా పథకాన్ని పొందవచ్చు అన్నారు. రైతుబంధుతో పాటు రైతు బీమా పథకానికి నిధుల విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.

సీఎం కేసీఆర్ రైతులకు అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం గురించి రైతుబంధు రైతుబంధు 24గంటల ఉచిత కరెంట్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కి అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News