Monday, December 23, 2024

సిఎం జగన్‌కు అనంతపురంలో నిరసన సెగ…

- Advertisement -
- Advertisement -

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం పుట్టపర్తికి వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌పై రైతులు నిరసనకు దిగారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం తుంపర్తి, మోటుమర్రు ప్రాంతాల్లో 210 ఎకరాల భూమిని అధికారులు సేకరించారని, ఇంతవరకు తమకు పరిహారం అందలేదని రైతులు వాపోయారు. పరిహారం అందించడంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని, సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు తోసివేశారని రైతులు ఆరోపించారు. భద్రతా సిబ్బంది ఆందోళనకారులను పక్కకు తరలించడంతో సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News