Friday, November 22, 2024

ఆందోళన ఆగకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఇళ్ల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

Farmers build House at Tikri border

 

న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఆందోళన సాగిస్తున్న రైతుసంఘాలు తమ పోరాటాన్ని మరి కొంతకాలం కొనసాగించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈమేరకు ఢిల్లీ హర్యానా మార్గం లోని టిక్రి సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చలికాలంలో ఎముకలు కొరికే చలిని తట్టుకున్నారు. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపి వేసినా తమ పట్టు విడవలేదు. తమను ఎటూ కదలనీయకుండా ఆంక్షలు విధించినా , ముళ్ల కంచెలను తమ చుట్టూ బిగించినా భయపడలేదు. ఇప్పటికి మూడు నెలలైనా వెనుకడుగు వేయకుండా ఇంకా మరికొన్ని నెలలైనా తమ పోరాటం సాగించడానికి రైతులు సిద్ధమయ్యారు. ఇళ్ల నిర్మాణానికి కావలసిన సిమెంట్,ఇటుకలను తమ స్వంత డబ్బుతో కొని తెచ్చుకుంటున్నారు.

కార్మికుల కోసం ఖర్చు చేయకుండా తామే కార్మికులై ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈవిధంగా ప్రతీ ఇంటికి రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు వారికి ఖర్చు ఆదా అవుతోంది. ఢిల్లీలో మండుటెండలు భరించడం కష్టం కనుక తాత్కాలిక గుడారాల నుంచి తాత్కాలిక ఇళ్లుగా తమ ఆశ్రయాలు మారుతున్నాయి. ఇప్పటికే 25 నిర్మాణాలు పూర్తి కాగా, రానున్న రోజుల్లో మరో 1000 నుంచి 2 వేల ఇళ్లు నిర్మించనున్నట్టు కిసాన్ సోషల్ ఆర్మీ నాయకుడు అనిల్ మాలిక్ చెప్పారు. టిక్రీ తోపాటు ఇతర సరిహద్దుల్లో కూడా ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News