Thursday, December 19, 2024

అగ్రి విత్తనాల కోసం ఎగబడ్డ రైతాంగం!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పంట.. విత్తానాల కోసం రైతులు ఎంత ధరైనా చల్లించేందుకు వెనుకాడరు..అటువంటి విత్తనాలు ఎక్కడున్న సరే వాటిని పొందేందుకు ఎంతదూరమైన వెళ్లేందకు సిద్దపడతారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలైతే ఇక చెప్పాల్సిన పనేముంటుంది. ప్రైవేటు విత్తన మార్కెట్లను అధికశాతం కల్తీలు , నాణ్యతులు లేని నాసిరకం విత్తనాలే ముంచెత్తుతున్నాయి. అధిక ధర పెట్టినా నాణ్యమైన విత్తనం లభిస్తుందన్న గ్యారెంటీ లేదు . ఈ పరిస్థితుల్లో ప్ర భుత్వ అధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాల యం, ప్రాంతీయ పరిశోధనాకేంద్రాలో నిర్వహించిన విత్తన మేళాకు రైతులు పోటెత్తారు. గ్రామాల నుంచి ఎన్నొ వ్యయప్రయాలకోర్చి వచ్చిన రైతులు విత్తనాలు దక్కించుకునేందుకు ఎగబడ్డారు. విత్తనాలు పొందేందుకు కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఆలస్యమైతే ఎక్కడ విత్తనాలు అయిపోతాయో అన్న ఆదుర్దా రైతులను తొక్కిసలాటకు గురుచేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన విత్తనమేళాకు అనూహ్యస్పందన లభించింది. రా

జేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విత్తనమేళాకు అనూహ్యంగా 2800 మంది రైతులకు పైగా హాజరయ్యారు. గత ఏడాదికన్నా రెట్టింపు సంఖ్యలో రైతులు విత్తనమేళా కు హాజరై వివిధ పంటల విత్తనాలను కొనుగోలు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయడానికి ఈసారి రైతులు ఆసక్తికనబరిచారు. శుక్రవారం వర్ష సూచన ఉండడంతో రైతులకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విత్తనమేళాను నిర్వహించినట్లు రిజిస్ట్రార్ మరియు పరిశోధనా సంచాలకులు డాక్టర్ రఘురామి రెడ్డి తెలిపారు. విత్తనమేళకు హాజరైన రైతులందరికీ భోజన సదుపాయం కల్పించామని, అలాగే రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాలతో పాటు, రాజేంద్రనగర్ లోను విత్తనాల విక్రయాలు రేపటి నుంచి కూడా కొనసాగుతాయని అన్నారు.

2018 నుంచి విశ్వవిద్యాలయంలో రాజేంద్రనగర్ లో విత్తనమేళ నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా సరాసరి 1000 నుంచి 1300 మంది రైతులు హాజరవుతున్నారు. అయితే ఈసారి విత్తనమేళకు అనూహ్యస్పందన లభించింది. 2800 మంది పైగా రైతులు శుక్రవారం రాజేంద్రనగర్ లో హాజరయ్యారు. వివిధ పంటలలో విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న విత్తనాలను విక్రయిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News