Monday, November 25, 2024

ఆందోళన విరమించిన రైతులు..

- Advertisement -
- Advertisement -

ఆందోళన విరమించిన రైతులు
11నుంచి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తాం: ఎస్‌కెఎం
ఇది తాత్కాలిక విరమణ మాత్రమే
డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు రాష్ట్రాల్లో ఇతర రూపాల్లో నిరసనలు
స్పష్టం చేసిన రైతు సంఘాల నేతలు

న్యూఢిల్లీ: ఏడాదిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) గురువారం నిర్ణయం తీసుకుంది. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌కెఎం నేతలు తెలియజేశారు. రెండు రోజుల్లో ధర్నా ప్రాంతాలను ఖాళీ చేస్తామని వారు తెలిపారు. అయితే డిమాండ్లను పూర్తిగా నెరవేర్చే వరకుఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

‘ఇది ఆందోళనను పూర్తిగా విరమించడం కాదు. తాత్కాలికంగా మాత్రమే ఆపి వేశాం. ఈనెల 15న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించాం’అని రైతు నాయకుడు, ఎస్‌కెఎం కోర్ కమిటీ సభ్యుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం అన్ని డిమాండ్లను నెరవేర్చిందో లేదో చూడడం కోసం ఈ నెల 15న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని మరో రైతు నేత గుర్నామ్ సింగ్ చదుని చెప్పారు. ఒక ప్రభుత్వం అన్ని డిమాండ్లను నెరవేర్చక పోతే ఆందోళనను తిరిగి ప్రారంభించడంపై తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటుగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)చట్టబద్ధతపై కమిటీని ఏర్పాటు చేస్తామని,అందులో రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. ఆ తర్వాత రైతులపై నమోదు చేసిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకుంటామని మరో హామీ ఇచ్చింది. దీంతో ఆందోళన విరమించాలన్న కేంద్రం విజ్ఞప్తి మేరకు రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయనున్నారు. ‘డిసెంబర్ 11నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయడం ప్రారంభిస్తారు. ఖాళీ చేయడానికి కొంత సమయం పడుతుంది’ అని రైతు నేత రాకేశ్ తికాయత్ చెప్పారు.

Farmers Called off Protest against Farm Laws

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News