Friday, November 22, 2024

డబ్లుటిఒకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేసిన రైతులు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో తిష్టవేసిన రైతు సంఘాలు సోమవారం తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ( డబ్లుటిఒ)వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రపంచ వాణిజ్యసంస్థ ఒప్పందం నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయించాలన్న డిమాండ్‌తో నినాదాలు చేశారు. ఢిల్లీకి 200 కిమీ దూరంలో ఖనౌరీ, శంభూ ప్రాంతాల్లో తిష్టవేసిన వేలాది మంది రైతులు ట్రాక్టర్‌ట్రాలీలతో, ఢిల్లీ వైపు కదం తొక్కారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగగా, భద్రతా దళాలు వారిని అడ్డుకుని ఆపివేశాయి. ఢిల్లీ ఛలో మార్చ్‌కు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వం వహిస్తున్నాయి.

అబుధాబిలో ప్రపంచ వాణిజ్య సంస్థ 13 వ సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈ ఆందోళన సాగుతుండడం గమనార్హం. దాదాపు 164 సభ్యదేశాల వాణిజ్య మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 26 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ లక్షం రైతుల సబ్సిడీలను నిర్మూలించడమేనని, ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలను భారత దేశం వ్యవసాయ రంగంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్యాసదృశ్యమౌతుందని రైతు సంఘాల నాయకులు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. డబ్లుటివొపై ఆదివారం రైతులు సదస్సు నిర్వహించారు. రైతు నే శుభకరణ్ సింగ్ మృతికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కెఎంఎం నేత సర్వణ్ సింగ్ పాంథర్ మళ్లీ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News