Sunday, December 22, 2024

కేబుల్ వైర్ల దొంగను పట్టుకున్న రైతులు

- Advertisement -
- Advertisement -

తూప్రాన్: తూప్రాన్ మండలం వట్టూరు, జండాపల్లి, పడాలపల్లి శివార్లలో ఉన్న వ్యవసాయ బోరుబావుల దగ్గర నుంచి కేబుల్ వైర్లు, సర్వీస్ వైర్లను దొంగలించిన దొంగను రైతులు సోమవారం పట్టుకుని చితకబాది తూప్రాన్ పోలీసులకు అప్పగించారు. వట్టూరు గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్కుల గ్రామానికి చెందిన బాణాపురం అంజనేయులు వ్యవసాయ బోరుబావుల దగ్గర నుంచి రాత్రి సమయాల్లో వైర్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు గమనించిన రైతులు అతన్ని పట్టుకుని విచారించగా వైర్ల చోరీలను ఒప్పుకున్నాడు. అంజనేయులుపై కేసు నమోదు చేసి, దొంగిలించిన వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News