హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్ల నుండి వచ్చిన బియ్యం ఒక్క కిలో కూడా కోనమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసినందుకు రైతులు నిరసన చేపట్టారు. భవిష్యత్తులో తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, ఎంఎస్ పి చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రైతుల నడ్డి విరిచేలా అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన మద్దతుగా రైతులు సంతకాలు చేయడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రైతుల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర బిజెపి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నడుచుకోవాలి లేకుంటే బిజెపికి రాజకీయంగా శిక్షించే రోజు దగ్గరలోనే ఉందని తెలంగాణ రైతాంగం హెచ్చరించింది.
- Advertisement -