Wednesday, January 22, 2025

స్వామినాథన్‌కు రైతు సంఘం సంతాపం

- Advertisement -
- Advertisement -

ప్రపంచానికి అన్నం పెట్టిన మహనీయుడు హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచానికి అన్నం పెట్టిన తమిళనాడుకు చెందిన స్వామినాథన్ మన దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని సిపిఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ నివాళులు అర్పించారు. డాక్టర్ కావాలని భావించినా 1943లో బెంగాల్ లో ఏర్పడిన కరువును కళ్ళారా చూసి మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు మళ్లారన్నారు. హరిత విప్లవం ద్వారా భారత వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారని, 1987లో ప్రపంచ ఆహార అవార్డును పొందారని పశ్యపద్మ గుర్తు చేశారు.

ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ కావటం గర్వకారణం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో 46 డాక్టరేట్లు పొందిన మహనీయుడు ఆయనేనన్నారు. కొత్త వరి వంగడాల ఉత్పత్తిని పెంచడమే కాక ఆహార సంక్షోభాన్ని తగ్గించటంలో స్వామినాథన్ సహాయపడ్డారని గుర్తు చేశారు. 2004లో ఏర్పడిన జాతీయ రైతు కమిషన్‌కు స్వామినాథన్ అధ్యక్షుడి ఉన్నారని, తన పరిశోధనలతో మేలైన గోధుమ, వరి వంగడాలను ప్రపంచానికి సృష్టించి ఇచ్చారన్నారు. యం యస్ స్వామినాథన్ మరణం రైతాంగానికి దేశానికి తీరని లోటుగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భావిస్తోందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News