- Advertisement -
ఢిల్లీ సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు, వారిని అడ్డగించేందుకు మోహరించిన పోలీసులతో సరిహద్దుల వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. పంజాబ్-హర్యానా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మంగళవారం వ్యాఖ్యానించారు.
హర్యానాలో మనోహర్ సింగ్ ఖట్టర్ ప్రభుత్వం రైతులను వేధించేందుకు కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. ‘రోడ్లను బ్లాక్ చేస్తామని మేం చెప్పడం లేదు.. ఆ పని చేస్తున్నది ప్రభుత్వమే’ అని ఆయన అన్నారు.
- Advertisement -