Monday, December 23, 2024

కెసిఆర్ పాలనలో రైతు దర్జా

- Advertisement -
- Advertisement -

మా విధానాలు.. మీ ఎన్నికల నినాదాలు

ప్రతి పల్లెను చేరిన రూ.50వేల కోట్ల ముల్లె

దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినది

నాడు పుట్టెడు దైన్యం నేడు పుట్లకొద్దీ ధాన్యం

65లక్షల మంది రైతులు, టిఆర్‌ఎస్
కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి
కెసిఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం
రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం
కొనలేకపోతోంది పొలిటికల్ టూరిస్టులు
వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు
టిఆర్‌ఎస్ హయాంలో ప్రతి ఎకరా భూమి
విలువ పెరిగింది మా పథకాలను మీ
రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి మేము
శ్వేతపత్రాలిస్తుంటే మీరు నల్లచట్టాలు
తెస్తున్నారు ఏ వేదికపైనైనా చర్చకు మేం
సిద్ధం, మీరు సిద్ధమా? : మంత్రి కెటిఆర్

ఊరూరా మిన్నంటిన రైతుబంధు సంబురాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిక్సూచిగా మారారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రైతన్నల కు ఆప్తబంధువు… నదులకు నడక నేర్పిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని అభివర్ణించారు. దీని కారణంగానే టిఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని దేశ వ్యాప్తంగా పేర్కొంటున్నారన్నారు. అందుకే ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సరికొత్తగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చా రన్నారు. ఇది సిఎం కెసిఆర్ మానస పుత్రిక అని అన్నారు. ఈ పథకం తో 65 లక్షల మంది రైతులకు బాసటగా నిలిచారని స్పష్టం చేశారు. దీని కింద రూ.50వేల కోట్లను రైతుల ఖాతాలో జమ అ య్యాయని చెప్పారు. ఇంత పెద్దమొత్తంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్ర భుత్వం కూడా రైతుల ఖాతాల్లో నిధులు వేసిన దాఖలాలు లేవన్నారు. చివరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూ డా ఇలాంటి ఘ నత సాధించలేదన్నారు.  రాష్ట్రంగా ఏర్పడిన కేవలం ఏడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. ఇందుకు ప్రధాన కారణం సిఎం కెసిఆర్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలేనని అని కెటిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతుబంధు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తలపెట్టామన్నారు. అయితే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబురాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దయనీయ స్థితిలో ఉండగా…ప్రస్తుతం కెసిఆర్ హయంలో రైతులు ఆనందోత్సవాలు, సంతోషాలు, ధాన్యం సిరులతో సంబురాలు జరుపుకునే పరిస్థితికి వచ్చా రన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని కెటిఆర్ అన్నారు. 65 లక్షల రైతుల కుటుంబాలకు 60లక్షల టిఆర్‌ఎస్ కార్యకర్తల తరపున సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రైతు బంధు ద్వారా రూ. 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఇది ఒక సాహసమన్నారు. సిఎం కెసిఆర్ మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నామన్నారు. వ్యవసాయ చరిత్ర లో ఇదొక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు పథకాన్ని సిఎం కెసిఆర్ తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. అక్కా చెల్లెళ్లు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇందుకు సిఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. అన్నదాతలు ఎద్దుల బండ్లతో ర్యాలీ తీసి తమ చేతికొచ్చిన పంటను చూపిస్తూ మద్దతు తెలుపుతున్నారు.
పొలిటికల్ టూరిస్టులు వచ్చి….ఏదేదో మాట్లాడుతున్నారు
రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలేనని అన్నారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమంలో మొదటి స్థానమే కాదు రైతుల ఆత్మహత్యల్లో కూడా మొదటి స్థానమే ఉండేదన్నారు. అయితే పంట దిగుబడుల్లో మాత్రం చివరి స్థానంలో ఉండేదన్నారు. అప్పటికీ…. ఇప్పటికీ పరిస్థితి ఎంత మార్పు వచ్చిందన్నారు. మన రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందంటే…ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీరు…ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన కరెంటు సకాలంలో విత్తనాల సరఫరా చేయడం వల్లే ఇది సాధ్యమైం దన్నారు. కానీ బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనికట్టుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ నేతలంతా తమ రాష్ట్రాల్లో రైతులకు, వ్యవసాయ రంగానికి ఏం ఒరగబెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు.
అపుడు ఊర్లకు ఊర్లే.. వల్లకాడుగా మారాయి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఊర్లకు ఊర్లే వల్లకాడుగా మారాయని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రైతుల దుస్థితి చూసి కెసిఆర్ చలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. అపుడు కరెంటు లేదు…. పెట్టుబడి సాయం లేదన్నారు. పంట దిగుబడులు అసలే లేవన్నారు. మీడియాలో అపుడు రైతుల దుస్థితి గురించి వచ్చిన కథనాలు చూస్తే ఇపుడు పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుందన్నారు. కెసిఆర్ పాలన ఏ స్థాయిలో ఉందో విపక్షాలు తెలుసుకోవాలన్నారు. ప్రధానంగా వలసల దుస్థితి పూర్తిగా అంతరించిందన్నారు. రైతుల దర్జా పెరిగిందన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయన్నారు. కోటి ఎకరాల మాగాణే కాదు ముక్కోటి టన్నుల ధాన్యగారంగా తెలంగాణ మారిందని కెటిఆర్ పేర్కొన్నారు. ఎఫ్‌సిఐ గోడౌన్‌లో పట్టనంత ధాన్యం తెలంగాణ నుంచి వస్తోంది నిజం కాదా? అని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ పది నుంచి పదిహేను లక్షలు పలుకుతోందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి అమ్ముతామంటే కొనేవారు దిక్కులేరని…ఇప్పుడు భూమి కొందామంటే అమ్మేవారు లేరన్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్లలో పడటం లేదా అని ఆయన నిలదీశారు. తమ ఖాతాలో రైతు బంధు పడడం లేదని ఏ ఒక్క విపక్ష నేత అయినా దమ్ముంటే చెప్పాలన్నారు.
రైతు బంధును ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి
దేశంలోని పలు రాష్ట్రాలు కూడా రైతు బంధును అనుసరిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరిందన్నారు. నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. మిగతాది దశల వారీగా మాఫీ చేస్తామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్న ప్రజలు నమ్మకుండా టిఆర్‌ఎస్‌కే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ఇది కెసిఆర్‌పై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకమన్నారు. రైతు బీమా… రైతుకు రక్షణ కవచంగా మారిందన్నారు. మండు వేసవిలోనూ రాష్ట్రంలో చెరువులు.. మత్తడ్లు దుంకుతున్నాయన్నారు. రాష్ట్రంలో హార్వెస్టర్ల, ట్రాక్టర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. ఐదు విప్లవాల ముంగిట రాష్ట్రం ఉందన్నారు. వాటిల్లో ప్రధానంగా సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి),శ్వేత విప్లవం, నీలి విప్లవం గట్టిగా అమలు చేస్తున్నామన్నారు.
వ్యవసాయం..దాని అనుబంధ విభాగాలపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల 71 వేల కోట్ల ఖర్చు చేసేందని కెటిఆర్ తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోటి ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై ఇక్కడి నుంచి (తెలంగాణ భవన్) వేదికగా సవాల్ విసురుతున్నా దమ్ముంటే రైతులకు వేరే రాష్ట్రాల్లో ఇంత మేలు ఏదైనా చేశారో చెప్పాలన్నారు. దీనిపై చర్చకు ఎప్పుడైనా…ఎక్కడైనా తాము సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వ పక్షాన తాము శ్వేత పత్రాలు ఇస్తున్నామే తప్ప… నల్ల చట్టాలు కాదని ఎద్దేవా చేశారు. విమర్శించే వాళ్లకు నెత్తి లేదు కత్తి లేదని మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్‌డిపి ప్రభుత్వ అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వమన్నారు. అందుకే కేంద్రం నుంచి వచ్చే నేతలకు లెక్కలు తెలియకుండా ఉత్తుత్తి మాటలు చెప్పిపోతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News