153లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
దిగుబడితో దేశంలోనే అగ్రస్థానంలో
నిలిచిన తెలంగాణ ఇది ఆల్ టైమ్
హై రికార్డు రైతుపండుగ స్టాళ్లను
పరిశీలించిన అనంతరం జరిగిన
కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్
రైతు బంధు కంటే బోనస్సే
బాగుందంటున్న రైతులు :మంత్రి
తుమ్మల నేటి సిఎం పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: శ నివారం నాడు జరగనున్న రైతుపండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నదాతలకు వరాలు ప్రకటిస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు.స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో పండని విధంగా వానాకాలంలో రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరా ల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పం డిందని ఇది ఇప్పటివరకు ఉన్న జీవితకాల రి కార్డు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప డి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భం గా ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు పండుగ, ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి శుక్రవారం వచ్చిన ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రైతు పండుగలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందని అన్నారు. అందుకే రైతులు పండుగ చేసుకుంటున్నారని చెప్పారు. రైతులకు మంచి పంటలు పండాయని, ప్రభుత్వం సైతం దొడ్డు రకానికి మద్దతు ధరకు కొనుగోలు చేసి సన్న రకం వరికి మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని అన్నారు.
రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొంటుందని తెలిపారు. రైతు పండుగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ఇందుకు కారణం వ్యవసాయ శాఖ మంత్రి అనుభవం అని కొనియాడారు. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి, వ్యవసాయ పక్షపాతి అని అన్నారు. గత పాలకులు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి 5 సంవత్సరాల్లో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేశారని, తర్వాత అరకొర రుణమాఫీ చేసి చేతులెత్తేసిందని అన్నారు. ప్రస్తుతం రూ.18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండేందుకు ఏది మంచిదో రైతులే చెప్పాలని, మీ సలహాలు, సూచనలు వినడానికే ఈ రైతు సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల అభిప్రాయం మేరకు వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామని తెలిపారు. రైతుబంధు కంటే బోనస్సే బాగుందని రైతులు అంటున్నారని తుమ్మల వ్యాఖ్యానించారు. రైతులు పామాయిల్ సాగు చేయాలని, 4 సంవత్సరాలు పెట్టుబడి ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
వలస జిల్లాగా పేరు పడ్డ మహబూబ్‌నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా ముఖ్యమైదని, దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభాముఖంగా నీటి పారుదల శాఖ మంత్రికి విజప్తి చేశారు. మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని, లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటాయని అన్నారు. అందువల్ల ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సహచర మంత్రిని కోరారు. రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, వనపర్తి, మక్తల్, అచ్చంపేట, నారాయణపేట, కల్వకుర్తి ఎంఎల్ఎలు జి మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, తూడి మేఘా రెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ, పర్ణిక రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ గోపి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.