వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద దీక్షను అడ్డుకున్న అన్నదాతలు
రైతులకు అండగా నిలుస్తున్నది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మొహం మీదనే చెప్పిన కర్షకులు
పలాయనం చిత్తగించిన హస్తం నేతలు
మనతెలంగాణ/వనపర్తి: అన్నదాతల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నేతలకు వనపర్తి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వరికల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద దీక్షల పేరుతో డ్రామాలు ఆడేందుకు ప్రయత్నించిన హస్తం నేతలపై రైతన్నలు తిరుగుబాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ విఫలమైందని కాంగ్రెస్ నాయకులకు రైతులు బుద్ది చెప్పారు. కొత్త కోట మండలం రామకృష్ణాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దీక్ష చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ దీక్షను రైతులు అడ్డుకున్నారు. కాంగ్‌స్ పాలనలో ఈ మాదిరిగా ధాన్యం కొనుగోళ్ళు చేసి ఉంటే బాగుండని రైతులు అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుందని రైతులు పేర్కోన్నారు. రైతుబంధు, రైతుబీమా వేదికలతో పాటు అన్నదాతలకు అండగా ఈ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందన్నారు. సాగుకు సరిపడా నీళ్ళు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని రైతులు తేల్చిచెప్పారు. రైతుచనిపోయిన వారం రోజులలోపే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాను సిఎం కెసిఆర్ ఇస్తున్నారని తెలిపారు. రైతులకు మేలు చేసిన ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని రైతులు ఉద్ఘాటించడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
Farmers fires on Congress Leaders at Wanaparthy