Thursday, January 23, 2025

కరెంటు కోత..రబీ సాగు కష్టమంటున్న రైతులు

- Advertisement -
- Advertisement -

దండేపల్లిః  కరెంటు కోతతో రబీలో సాగు చేసిన వరి పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామంలో గత రెండు రోజుల నుండి వ్యవసాయ మోటర్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో వరి పొలాలకు సాగునీరు అందక పగుళ్ళు తేలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఎం కెసిఆర్ 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెబుతుండగా, స్థానిక విద్యుత్ అధికారులు కరెంటు కోత విధించడంతో నాట్లు వేసిన వరి పొలాలు నీరు అందక ఎండుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చీటికి మాటికి కరెంటు సరఫరా నిలిపి వేయడం వల్ల వరి పంట సాగు చేయడానికి నేల చదును చేయడం కష్టంగా మారిందని రైతులు దిగులు పడుతున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా విద్యుత్ సరఫరాలో అదే తంతు కొనసాగుతుందని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి వ్యవసాయ పంపు మోటర్లకు 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని మండల రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News