Thursday, January 23, 2025

రైతు శ్రేయేస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

Farmers happy for Rythu bandhu

మనతెలంగాణ/పాలకుర్తి: దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర వేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రా ష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తె లంగాణ రాష్ట్రం నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలం పరిధిలోని కుక్కలగూడూర్ గ్రామంలోని రై తువేదిక వద్ద మండల వ్యవసాయ శాఖ ఆధ్వరంలో నిర్వహించిన రైతుబంధు సంబరాల్లో ముఖ్యఅతిధి గా పాల్గొన్న చందర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్ర భుత్వం సాగునీటిని తీసుకురావడంతోపాటు, వ్యవసాయం దండుగ అన్న రైతులలో ఆత్మవిశ్వాసం నిం పి తిరిగి వ్యవసాయరంగం వైపు దృష్టిసారించేందుకు ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తె లంగాణ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుండడం, ఎనిమిదో వి డత రైతు బంధు కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 3 నుండి 10 తేదీ వరకు రాష్ట్రంలోని రైతుబంధు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో గ్రామగ్రామాన జరిగే రైతు సంబరాలల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ముందు గా వంద ఎడ్లబండ్లతో గ్రామంలో రైతులతో కలిసి ర్యా లీ నిర్వహించారు. అనంతరం సిఎం కేసిఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సంబరాలలో ఎంపీపి వ్యాళ్ళ అనసూర్యరాంరెడ్డి, వైస్ ఎంపీపి ఎర్రం స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, మేడిపల్లి వ్యవసాయ సహకార సం ఘం చైర్మన్ మామిడాల ప్రభాకర్, కన్నాల వ్యవసా య సహకార సంఘం చైర్మన్ బయ్యపు మనోహర్ రె డ్డి, మండల రైతు సమితి అధ్యక్షులు కల్లెపు మదన్‌మోహన్ రావు, సర్పంచులు గోండ్ర చందర్, కోల లత, గంధం లక్ష్మినారాయణ, పల్లె అశోక్, సుధగోని లా వణ్య శ్రీనివాస్, రావుల శారద, పున్నం సాగర్, కొ ప్పు పుష్పలత రాజేశం, చింతకింది నర్సమ్మ, నర్సిం గం, మ ల్లెత్తుల శ్రీనివాస్, స్థానిక తాహాసిల్థార్ వరంద న్, ఇంచార్జీ ఎంపీడీఓ షబ్బీర్‌పాషా, మండల వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బం ది, పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, అధికసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి గాయకులు దయా నర్సింగ్, ఈదునూరి ప ద్మ, సానగొండ రవీందర్, జనగామ రాజనర్సు, స్వ ప్న, స్పందన, రమ తదితరులు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి
కాల్వశ్రీరాంపూర్ : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో శుక్రవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రె డ్డి పాల్గొనిన అనంతరం సీఎం కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తి రుపతిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నా యకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
రామగిరి : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రామగిరి మండలం రత్నాపూర్, బేగంపేట, నాగేపల్లి పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన ఎంపిపి ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ మాట్లాడుతూ, సీఎం కేసిఆర్ రైతుల అభివృ ద్ధి ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వి ద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మ్యాదరవేన కుమార్, వైస్ ఎంపిపి కాపురబోయిన శ్రీ దేవి, స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ పివిరావు, సోషల్ మీడియా ఇంచార్జీ బర్ల కుమార్, గ్రామశాఖ రైతుబం ధు అధ్యక్షులు తిరుపతి, మండల వ్యవసాయశాఖ అ ధికారి భూక్య మోహన్, ఏఈలు రమ్య, జ్యోత్నా, నవీ న్, నయనీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జూలపల్లి : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా జూ లపల్లి మండలం కేంద్రంలో శుక్రవారం నాడు మం డల స్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను మండల ఎంపిపి కూసుకుంట్ల రమాదేవి రాంగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తె లంగాణ రైతులు ఆర్థికంగా పురోగతి సాధించాలని సీ ఎం కేసిఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కు ప్రతి ఎకరాలకు పెట్టుబడి సాయం కింద ఒక పం టకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు కలిపి సంవత్సరానికి ఎకరాకు రూ. 10 వేల పంట పెట్టుబ డి సాయం అందిస్తున్నారన్నారు. రైతుబంధు వారో త్సవాల్లో భాగంగా మహిళా రైతులు వేసిన రంగు రం గుల ముగ్గులను తిలకించి వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీసారపు వెంకటేశం, కమిటి చై ర్మన్ కంది చుక్కరెడ్డి, వైస్ ఎంపిపి మొగురం రమేష్, సర్పంచులు నర్సింగ్ యాదవ్, బంటు ఎల్లయ్య, రాజ న్న, మహంకాళి తిరుపతి, సొల్లు పద్మ శ్యామ్, రేశవే ని రాధా శ్రీనివాస్, ఎంపిటిసి దండే వెంకటేశ్వర్లు, క త్తెర్ల శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్లు లాల్ మహమ్మద్, టిఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుంట రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్‌లు, ఉపసర్పంచ్ ఆడువాల తిరుపతి, టిఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం రాజేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు, మండల స్పెషల్ ఆఫీసర్ రంగారెడ్డి, ఎఎంసి సెక్రటరీ అగ్రికల్చ ర్ ఎక్టెన్షన్ ఆఫీసర్‌లు రమేష్, సాయి ప్రసన్న, టిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట: మండలములోని వివిద గ్రామాల్లో తె రాసనాయకులు, కార్యకర్తలు చేపట్టిన రైతు బంధు వారోత్సవాలు విజయ వం తంగా కొనసాగుతున్నా యి. రైతాంగానికి అన్ని విధాల బరోసా కల్పించిన సిఎం కేసిఅర్ చిత్ర పటానికి శుక్రవారం నారాయణ పూర్ జిపి కార్యాలయం ఆవరణలో పాలాభిషేకం చే శారు. పలువురు అన్నదాతలను శాలువాలు కప్పి స న్మానించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రనధానం చేశారు. జడ్పీటిసి చీ టి లక్ష్మన్ రావు పాఠశాల మైక్‌సెట్‌కు రూ. 5 వేలు విరాళం అందించారు. కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రే ణుక, గుండారపు క్రి ష్ణారెడ్డి , ఎంపిటిసి,అపెరా సు ల్తానా మజీద్, సర్పంచ్ నిమ్మలక్ష్మి నారాయణ రెడ్డి , నాయకులు జిల్లా ఇంచార్జి తోట ఆగయ్య , వరుస కృ ష్ణహరి, బండారి బాల్ రెడ్డి ,ఉన్నీసాబేగం , గుల్లపల్లి నర్సింహరెడ్డి, ఎలుగందుల నర్సంహులు, పలువురు కార్యకర్తలు నాయకుల పాల్గోన్నారు.
ఇల్లంతకుంట: రైతు శ్రేయేస్సే తెలంగాణ రాష్ట్ర సర్కా ర్ లక్షమని జడ్పీవైస్ చైర్మన్ సిద్దంవేణు, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాలలో భాగంగా మండలంలో ని పొత్తూరు, అనంతగిరి గ్రామాలలో వారోత్సవాల ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరి నాటుతో కే సిఆర్ పేరు రాసి రైతులు అభినందనలు తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా రైతులకు పెట్టు బడి సాయం అందివ్వలేదని, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న సిఎం కేసిఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. అనంతరం మం డలంలోని సోమారంపేట, గాలిపెల్లి ప్రభుత్వ పాఠశాలలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా విధ్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటిలను నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్దంశ్రీనివాస్, ఎం పిటిసి గొట్టపర్తి పర్శరాములు, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బండారి పర్శరాములు, కదురు శేఖర్, బండారి మ హేష్, కోలరాజు, అంజనేయులు, దేవేందర్, వడియా ల సత్యనారాయణరెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.
తిమ్మాపూర్: రైతు సంక్షేమానికి సిఎం కెసిఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కరీంనగర్ మార్కెట్ కమిటీ చై ర్‌పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు అన్నారు. రైతుబంధు సంబరాల్లో భాగంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పలువురు రైతులను స న్మానించారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు పథకాన్ని పెట్టి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని కొనియాడా రు. కాళేశ్వరం జలాలు, రైతుబీమా, ఉచిత కరెంటు తో పాటు సకాలంలో ఎరువులు అందజేస్తున్నారని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుజ్జుల ర వీందర్ రెడ్డి, డైరెక్టర్లు సాదుల వెంకటేశ్వర్లు, పెట్టం ర మేశ్, ఖమ్మం కృష్ణ, ఎండీ అక్బర్, వంగాల శ్రీలత, రా వ రాజు, బిక్కుమల్ల సత్యనారాయణ, డీఎంఓ పద్మావతి, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ పురుషోత్తం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News